ఎందుకలా ఉండుండీ
అపరచితమైన కవిత్వంలోని వాక్యంలా..చీకటి దుప్పటి కప్పుకొని
కన్నీటి కబుర్ల వేదనాస్రవంతిలో నన్నుంచి
నిర్వికారంగా వెళ్ళిపోతావు
స్వప్నాల అంచులపై నిలబడ్డ నేను
బరువెక్కుతున్న క్షణాలను మోయలేక
మంత్రలిపిని మౌనం చేసి
ఎదురుచూపుల ప్రవాహంలో కొట్టుకుపోతాను
రాతిరిలో రగిలే జ్ఞాపకాలది..
నిద్రగన్నేరు వాసన
చిరుగాలి చిటికెల వాసన
రాణీపువ్వుల నవ్వు సువాసన
తేనెలా మారిన సంద్రపు వాసన
ఇంతకన్నా ఏం చెప్పనూ..
అయితే..
ఇప్పుడిదంతా పసరు గాయపు వాసన
గుండె కాలుతున్న విషాదపు వాసన..
No comments:
Post a Comment