చిరుగాలికి కదిలే ఇసుకరేణులా నీ హృదయం కదిలిందెందుకో
గ్రీష్మంలోనే మల్లలు పూసేనని తెలిసీ పరిమళానికి ఉక్కిరవడమెందుకో
తుషారబిందువంటి పుష్యరాగంలో ఆ పదనిసల తడబాటెందుకో
మనసుపడి ప్రకృతి గీసిన చిత్రానికి అంత అబ్బురమెందుకో
ముత్యాలరంగులోని బుగ్గలూ.. సూటిగా సంధించే కన్నులూ
అనంతమైన సిగ్గు దాచుకున్న పెదవులూ..చల్లని శ్వాసను జ్వలించే ఊపిరులూ
తాకినా తనివి తీరదనిపించే తనువూ..పూలధనువులా నీకై నడిచొచ్చే పాదాలూ
నీతో కలలో కలిసి విడిపోయినట్టనిపించే చూపులూ..

మనో ప్రాంగణమంతా నిన్ను రాసుకున్న శతకమని తెలీదా
No comments:
Post a Comment