Tuesday, 6 August 2019

//నీ కోసం 26//

శూన్యం నుంచీ స్వర్గంలోకి ప్రేమగా నడిపించింది నువ్వేగా
కాలపు కదలికల్లో తడబడుతున్న నన్ను గుండెల్లోకి చేర్చుకున్నదప్పుడేగా..

నిశీధిరాత్రుల పులకింతలన్నీ నులివెచ్చనయ్యింది
నీ ఒడి పంచుకున్నందుకేగా
ప్రతిరేయీ స్వప్నంలో కెరటమై అల్లుకొనేది
నువ్వు తీరమై చేచాచుతున్నందుకేగా..

నీ కనుపాపల నీడల్లో నేనొదిగాక
ఇన్నినాళ్ళ కౌగిలింతలు
నీ పెదవులపై నవ్వులే పూయించలేదంటే నమ్మమంటావా

కురవనంటూ అలిగిన మేఘం భారంగా కదిలినట్టు
సగం శిల్పముగా నన్ను మార్చి మరుగైపోతావే
ప్రాణాలు అయిదూ పంచమవేదమంటూ నిన్నే వల్లిస్తున్నాక
మనమధ్య నిశ్శబ్దానికైనా నేను చోటివ్వనని తెలుసుగా..

ఎప్పట్లా చూపులతో దోబూచులాడవా..
నీకు తెలీకుండా రెప్పలమాటు దాక్కుని కవ్వించాలనుంది..



No comments:

Post a Comment