Tuesday, 6 August 2019

//నీ కోసం 24//

నీతో నేనున్న సమయం
ఎంతకీ అంతుపట్టని సంతోషం
మనసు తడిమి చూసున్నంత మెత్తగా తగులుతుంటే
అదో ఊహే కదాని పట్టించుకోడం ఆపలేనందుకే

యుగాల మృదుల మోహన స్పర్శ
హృదయ స్పందనలు పెంచి
కనురెప్పల కదలికల్లో మసకగా మెరుస్తుంటే
ఆ కాసేపు చిరువానకే మురిసిపోతుంటా

ఊపిరి సలపనివ్వని రాతిరిలో
చీకటినంతా నీ గుసగుసలతో నింపి
కొసరి కొసరి కొన్ని నవ్వులు పంచిపెడతాను
తటిల్లతలై మెరిసే నీ కళ్ళు
అప్పుడు కదా నన్ను చూస్తూ మూసుకుంటాయి
నీ జతలో నా ఏకాంతమలా 
తీయగా సశేషమవుతుంది రోజూలానే..!!

No comments:

Post a Comment