Tuesday, 13 August 2019

// నీ కోసం 33 //





ఆకాశంలో సంచరిస్తున్న మేఘానికి గమ్యం లేదనుకోకు
రగులుతున్న విరహాన్ని ఓదార్చేందుకే నీవైపుకి వస్తుందది

నిద్దురలో చలిగాలి అలలొచ్చి స్పర్శిస్తే గమనించు
నాలోని ప్రేమను పంచేందుకొచ్చిన తావినలా శ్వాసించు

ఎదురుచూపుల చెలమల్లో దాహంతీరే దారిలేదనుకోకు
నీ మనస్సంద్రంలో ఉప్పునీరు నా తలపుతో తీయగా మారింది చూడు

ఎదపై వాలిన జాజికొమ్మను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో
ఇద్దరమూ కలిసి పంచుకున్న ఆర్తి గుర్తుకొస్తుంది..

ఆకులు గలగలలాడే అరుణోదయాన్ని ఎదురేగి కౌగిలించు
నువ్విచ్చిన ముద్దులు తిరిగిచ్చేందుకొచ్చి సిగ్గుపడుతున్నదెవరో గ్రహించు

అక్కడ ఇక్కడ నన్ను వెదికి అలసిపోకు
కన్నుమూస్తే నీ అనంతమైన కోరికనై సాక్షాత్కరిస్తా ప్రతిక్షణమూ నేను..💕💜

No comments:

Post a Comment