అలా కురుస్తావు నిజమే
నేనో ఏమరుపాటు క్షణంలో ఉన్నప్పుడు
మెడ వంపులో రహస్యాన్ని వెతుకుతున్నట్టు
అల్లిబిల్లి కలలు మదిని వణికించినట్టు
ఒక్క కౌగిలింతకే నా ఊపిరాగినట్టు
నేనో ఏమరుపాటు క్షణంలో ఉన్నప్పుడు
మెడ వంపులో రహస్యాన్ని వెతుకుతున్నట్టు
అల్లిబిల్లి కలలు మదిని వణికించినట్టు
ఒక్క కౌగిలింతకే నా ఊపిరాగినట్టు
అచ్చంగా తడిపేందుకే నువ్వొస్తావు..
గుప్పెడు మల్లెల గంధాలు
కొత్తగా మొదలెట్టిన కూనిరాగాల్లో
నా మీద బెంగంతా పాడేస్తూ
కాలాన్ని ఆపి నన్నో మధురానుభూతుల తీరానికి చేర్చినట్టు
నువ్వేంటో చాలా వింతగా అనిపిస్తావు
కొత్తగా మొదలెట్టిన కూనిరాగాల్లో
నా మీద బెంగంతా పాడేస్తూ
కాలాన్ని ఆపి నన్నో మధురానుభూతుల తీరానికి చేర్చినట్టు
నువ్వేంటో చాలా వింతగా అనిపిస్తావు
కలిసి చిగురిద్దామని అప్పుడన్నావ్ కదా
ఆనందాన్ని కప్పుకుంటూ పొదుపుకో నన్నలా
నువ్వు పంచాలనుకున్న మౌనరాగానికి
నా గుండెచప్పుడ్ని నేపథ్యం చేస్తా
కొన్ని కువకువలన్నా పాడుకుందాం ఈ పూట..
ఆనందాన్ని కప్పుకుంటూ పొదుపుకో నన్నలా
నువ్వు పంచాలనుకున్న మౌనరాగానికి
నా గుండెచప్పుడ్ని నేపథ్యం చేస్తా
కొన్ని కువకువలన్నా పాడుకుందాం ఈ పూట..
No comments:
Post a Comment