Tuesday, 6 August 2019

//నీ కోసం 23//

తెలుసా నీకు
రాత్రైతే నీ హృదయం ఆనంత సంచారానికి బయలుదేరుతుందేమో
కాసేపటికే నావైపొచ్చి కొంచం చోటిమ్మని అడుగుతుంది

నా సమక్షం నీకిష్టమైన వ్యాపకమంటూ
ఒక కవిత చెప్పమని కోరుతుంది
ఏకాంతం ఝుమ్మంటున్న హోరులో
కొన్ని పదాలను ప్రేమగా మార్చి నీపై చల్లుతాను

మౌనాన్ని కప్పుకున్న నువ్వేమో
నీలోపల అరణ్యంలోకి జారిపోతూనే
ఆసరాకోసమని నన్ను తోడురమ్మంటావు
నీ మృదువైన గుప్పిళ్ళలో నావేళ్ళు కలిపి
అదేమో గుట్టుగా నవ్వుకుంటావు

కలల కోసమని కనుమూసే నేనేమో
నీ ఇష్టానికి మెత్తగా శ్వాసిస్తాను
చూస్తూనే తెల్లారిపోతుందీలోగా
నువ్వేమో నా పేరునే ప్రియమారా పల్లవిస్తుంటావు





No comments:

Post a Comment