కాలం కదలికల సాక్షిగా
నేను అస్థిమితంగా కదులుతున్నా రాత్రి నుంచి
మనసు ముసురేసినప్పుడు
నీ దాగుడుమూతలేంటో
గుండెలోతుల్లో తీరాన్ని వెతుకుతున్న కెరటాలకి తెలీట్లేదు
వాలిపోతూ నిద్రనాపుకున్న రెప్పలచప్పుళ్ళు
వినబడలేదా
ఆత్మీయంగా కురిసిన ఒక్క నీటిబొట్టూ
తడపలేదా
అయినా వెతకడమెందుకో పిచ్చిమనసు
No comments:
Post a Comment