Tuesday, 6 August 2019

//నీ కోసం 28//

ఎంత రాసినా తనివితీరని తపనలో నేనుంటే 
ఇంకా చెప్పమంటూ ఎరలా ఎదను కొరుకుతావు
హృదయమంతా నిండిన ప్రేమరాగాన్ని ఆస్వాదిస్తూనే
ఐక్యమయ్యేందుకు సమయం సరిపోలేదంటావు

పొద్దుతిరుగుడుపువ్వులా నీ వంకే నే చూస్తున్నా..
విప్పపూల వింజామరలా మనసూచలేదంటావు
అలికిడి చేస్తున్న అలలన్నీ నీ చిలిపినవ్వులైతే
పెదవులతీరంలో నే నిలబడ్డా ఇంకా దగ్గరవలేదంటావు..

నన్ను కాదని నిన్ను చేరిన మనసుని అడుగు
వేణువై రవళించేందుకే నిన్ను చేరానని చెప్తుంది
నా విరహాన్ని ముగించేందుకే శ్వాసలో చేరి
నీ ఊపిరికి సాంబ్రాణి ధూపమై పరిమళమందిస్తానంటుంది.. 
  
నిండిన నీ తలపుతో కదులుతున్న క్షణాలనడుగు చెప్తాయి
నువ్వొచ్చేవరకూ దిగులు కావ్యరచనలే కొనసాగుతాయని ఒప్పుకుంటాయి..



No comments:

Post a Comment