తలచిన ప్రతిసారీ తలగడ చేసుకుని మరీ
ఎదపైనొచ్చి వాలిపోతావు
దేహమంతా ప్రవహించేంత ప్రేమని ఆపుకోలేక నేనవస్థపడతాను
లోపలి పొరల్ని మీటే మధురగానం
మరోసారి వినేందుకేమో కళ్ళు విప్పకుండానే మెత్తగా మురిసిపోతుంటావు
నా గుండెచప్పుళ్ళలో కలగలిసిన నీ ముద్దులసడి
ఇప్పుడు నీకో అలౌకిక నిశ్శబ్దమై వినబడుతున్న పరవశపు లాలి కదా
మనసులొకటయ్యే ఈ రాత్రి పూర్తిగా మన స్వంతమని పదేపదే చెప్తుంటావు
ఈ దూరం ఎంత దగ్గర చేసిందని అనుకున్న ప్రతిసారీ
ఇంకొంచం చిలిపిగా నవ్వుతావు
తెరిచినా మూసినా అందంగా ఉండే అరుదైన కళ్ళు నీవి
No comments:
Post a Comment