నీ పెదవుల తీపిరుచికి నిద్దురలో కదిలే కన్నులు
నా ప్రత్యూషపు స్వప్నానికి మేలుకొలుపుగా
ప్రతిరోజూ నుదుట నువ్వు పెట్టే సంతకంతో
నా ప్రత్యూషపు స్వప్నానికి మేలుకొలుపుగా
ప్రతిరోజూ నుదుట నువ్వు పెట్టే సంతకంతో
కావ్యరచనకు మేలిముసుగు తెరతీసినట్టు విచ్చుతాయి
గతితప్పబోతున్న క్షణాలు స్వరజతులై
నీ పరిష్వంగంలో స్వగంధపు అమృతఝరులై
వెచ్చని పులకింతను ప్రవహించమన్నట్టు
అణువణువూ ఆవిరై స్పందిస్తున్న సంకేతాలు
నీ పరిష్వంగంలో స్వగంధపు అమృతఝరులై
వెచ్చని పులకింతను ప్రవహించమన్నట్టు
అణువణువూ ఆవిరై స్పందిస్తున్న సంకేతాలు
చినుకుగా మొదలైన మేఘం
జడివానగా మారి వెదజల్లుతున్న ఊహల్లో
రాలుతున్న గుల్మోహరాల్లోని పుప్పొళ్ళు
నీలో నేను తప్పిపోయిన ఆనవాళ్ళు
జడివానగా మారి వెదజల్లుతున్న ఊహల్లో
రాలుతున్న గుల్మోహరాల్లోని పుప్పొళ్ళు
నీలో నేను తప్పిపోయిన ఆనవాళ్ళు
సన్నటి గుసగుసనింక గానం చేయకలా
నా గుండెల్లో కలవరింతలు కృతులై హద్దులు మీరేలా..
నా గుండెల్లో కలవరింతలు కృతులై హద్దులు మీరేలా..
No comments:
Post a Comment