Thursday, 8 August 2019

// నీ కోసం 32//

మెలకువలో నువ్వు ఆదమరచినప్పుడల్లా అనుకుంటా
నువ్వో ఆర్తిలో మౌనానికి దగ్గరయ్యుంటావని

నా గుప్పెడుగుండెలోని అనుభూతులు
నీ అనుభవపరం చేసేందుకని
ఆ నునుస్పర్శలోని మాధుర్యాన్ని
కావ్యధారగా రంజించాలనే 
కలువపూల పడవలా మనసూగుతుంది

నిన్నుక్కిరిబిక్కిరి చేసి 
ఊపిరాడకుండా చేసేందుకు 
తీయందనపు అంచులదాకా తీసుకెళ్ళేందుకు
నా ఒడి సిద్ధమైందనేం చెప్పను

నిశ్శబ్దాన్ని ప్రశాంతంగా మార్చి
కల్లోలాన్ని ఉత్సాహంగా చేయగలిగే
ఆ చిరుమంత్రం నా చీర మడతలో
ఉందని తెలిసాక ఈ దూరం దుర్భరమవుతుంది

రెక్కలేసుకొని నువ్వొస్తావు కదూ..
ఈ అపురూపానందాన్ని పొందేందుకు
ఇన్నాళ్లూ కలలకిచ్చిన క్షణాలు నిజంచేసేందుకని

No comments:

Post a Comment