Tuesday, 6 August 2019

// నీ కోసం 22 //

నీ కన్నుల్లోకి తొలిసారి చూసినప్పటి మాట
వలపువేదం విశేషంగా ఆకర్షించి
అలమటిస్తున్న మదిని విస్తారంగా చదువుకోమంది
అప్పుడు మొదలైన ఎడతెగని ధ్యాస
ఇన్నాళ్ళైనా కుహూకుహూమని కలవరిస్తూనే ఉంది..  

ఊహకందని ఆదమరపు 
అనాలోచితపు మౌనంగా మారి
హృదయమంతా ప్రవహించినప్పుడు
కొన్ని సుతారాలు మెత్తగా చలించాయి
రాతిరి పరిమళిస్తుందని తెలియని నేను
గుండెగది తలుపు తీసి ఉక్కిరిబిక్కిరయ్యాను..

అప్పటికప్పుడు నవ్వులు నేర్చిన క్షణాలు
పెదవుల్లో మోహనవర్ణాన్ని దాచినట్టు గుర్తొచ్చి
చీకటిలో నక్షత్రాల మాదిరి మిలమిలలాడుతూనే
అరవిరిసిన పూలై ఆకాశమంత సంతోషాన్నిచ్చాయి..
ఇప్పుడిక చెప్పేదేముంది
నీలో నేనొదిగి చాలా కాలమైందిగా..
మనమంటే నిండుకౌగిలే కదా ఇప్పుడూ ..!!

No comments:

Post a Comment