Tuesday, 6 August 2019

//నీ కోసం 31//

తప్పిపోయిన నా కలను వెతికేందుకు చూసిన నీ కళ్ళలో
గుప్పెడు ఆర్తి కనబడినందుకే నే మరుదివ్వెనై వెలిగా..

పూలడోలలో ఊగుతున్న మనసప్పటికే నీ వలపు మేలుకొల్పుతో 
 చిలిపి చెరలకని నీ నవ్వుల్లో చేరిందని తెలుసుకున్నా..

క్షణానికో పరవశాన్ని పంచే నీ తలపును కాదనలేకనే
నేను సైతం నీ సరిగమకు మధురిమనై జతపడిపోయా..


నీ మోజుల్లో విరజాజుల్లా..నీ కౌగిలిలో కోరికలా
మలిపొద్దు ముద్దుల్లో చిరుకాటు అల్లరిగా నే చేరిపోయా..

నీ అరచేతి వెచ్చదనం నా ఏకాంతపు ధ్యానమవ్వాలని
మునుపులేని మౌనాన్ని నాకు నేనుగా కప్పుకున్నా

ఇంకేం స్పర్శ కావాలిప్పుడు
నేనంతా నువ్వై నీ మేనంతా పరిమళిస్తుంటే

No comments:

Post a Comment