మనసు తడుముకున్న ప్రతిసారీ..ఇక్కడే ఉన్నాననే సమాధానమొస్తుంది
ఊహతీత చంచలత్వంలో అడుగేసినప్పుడు నీకూ తెలిసుండదు
మడమ తిప్పే వీలున్నా..ఈ హృదయవనంలోనే సుస్థిరమవుతావని
నీకే పరిమళం నచ్చిందో..ఇంకే ఆహ్లాదమందిందో
సొంతమైన సంతోషాలు సగంలో విడిచి
ఊహతీత చంచలత్వంలో అడుగేసినప్పుడు నీకూ తెలిసుండదు
మడమ తిప్పే వీలున్నా..ఈ హృదయవనంలోనే సుస్థిరమవుతావని
నీకే పరిమళం నచ్చిందో..ఇంకే ఆహ్లాదమందిందో
సొంతమైన సంతోషాలు సగంలో విడిచి
నీ నుంచీ నువ్వు తప్పుకుంటూ నాలోకొచ్చావు..
సందేహాలూ సందిగ్ధాలూ సమయానుకూలానికి వదిలి
ఆనందాలూ అంతరాత్మలూ మాత్రం అపూర్వమన్నావు
మృదువైన మాటల మంత్రాలు చల్లి
మంచు మువ్వలుగా మదిని మలచి
సరికొత్త స్వరాలతో సరిగమలు సరిచేసావు
ఇంకేమడగను ఎప్పుడొస్తావని
ఎటు చూసినా నువ్వే కనిపిస్తూ
యుగాలు దాటి నాకోసమొచ్చిన ఆనవాళ్ళు గుర్తించాక..

No comments:
Post a Comment