పొద్దు మారిపోయే వేళ
కొన్ని పరిమళాలు పువ్వులనొదిలి
పరిసరాలను అలజడి పెడుతుంటాయి
ఆగి ఆగి రాలుతున్న ఆకులేమో
ఏవో మాటలు మననం చేస్తున్నట్లు
మృదువైన ప్రకంపనలు మదికందిస్తాయి
మౌనంగా మొదలయ్యే వాక్యాలేమో
అప్పటికప్పుడు ప్రాణం లేచొచ్చినట్లు
పెదవాపుకోలేని వెల్లువలవుతాయి
శరద్వలువలు విడిచే వెన్నెలలేమో
ఆకాశాన్ని దాటొచ్చి మరీ
పున్నమిని అందంగా మార్చేస్తాయి
No comments:
Post a Comment