Thursday, 9 December 2021
//నీ కోసం 421//
ఉదయాన్నే నీ చూపులు తడిమినప్పుడంతా
పురివిప్పిన పువ్వులా పరిమళించి
అగరుపొగల ధూపాన్ని మించిపోయానా
సాయింత్రపుగాలి కెరటమై వీచినప్పుడంతా
గొంతు విప్పే ఏకాంతాన్ని
నీ మౌనాలాపనగా ఆలపించానా
మెత్తగా మత్తుగా ఉండే రాత్రులప్పుడు
కాలాన్ని కవిత్వంతో ఆపి మరీ
నీ చిరునవ్వులుగా రాసుకున్నానా
గుండెల్లో దాచుకున్న ప్రేమనంతా
గుక్కతిప్పుకోనివ్వని గానం చేసి
లోలోపలి సంగీతాన్ని నిద్దుర లేపానా
మధుర స్వప్నంలా నిన్ను తపించి
చూపులతో ఎంత పిలిచానో..
తీరా నువ్వొచ్చినప్పుడేమో
నిలువలేక వెనుదిరిగిపోయాను
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment