Thursday, 9 December 2021
//నీ కోసం 413//
అలసిపోయిన ఆకు దిగులు
దేహాన్ని దాటి మరీ హృదయాన్నావహిస్తుంటే...
అశాంతికి అనేక ముళ్ళున్నట్టు
భరించలేని విచారం
కారణాలకందని కన్నీటి పర్యంతం
సరిహద్దులు ఎగిసి మరీ
నిర్లిప్తపు సంకేతాలందించినా
అలవికాని నిట్టూర్పుల ఆగంలో
రెక్కలు మొలిపించుకున్నా రాలేని
ప్రవాసమంత ఈ దూరం
నువ్వో చూపుకందని గోధూళి స్వప్నం
మలుపు మలుపుకీ గాయపడుతున్న
మనసు తడబాటు క్షణాల
విరుద్దరాగాల విషాదపు కచేరిలో
చలిగాలులకలవాటులేని నిశ్చలత్వం
చీకట్లో నీడలు నడుస్తున్న నిశ్శబ్దం
Pch.. తప్పదు.. తట్టుకుందాం
కాలం కనికరించి
ఈ రాకాసి రోజులు అంతమయ్యేవరకూ
అప్రమత్తతను కప్పుకుందాం !!
చిన్ని చిన్ని మాటల వంతెనేసుకుని కలుసుకుందాం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment