Thursday, 9 December 2021
//నీ కోసం 410//
ఏమో నాకైతే చిరుచలిగా ఉంది
శరత్తు సగం కూడా కదలకుండానే హేమంతాన్ని పిలిచినట్టుంది
నిశ్శబ్దమంటేనే భయపడే నేను,
కొన్ని సవ్వళ్ళకి ఉలిక్కిపడి
ఇష్టమైన పుస్తకాన్నీ చదవలేకపోతున్నానా..
సాయింత్రం ముగుస్తూనే చిన్నగా వణుకు మొదలయ్యి
ఏవో పురా జ్ఞాపకాలు గుండెపొరల్ని కదుపుతూ
కొన్ని దిగులు పాటల్ని గుర్తుకు తెస్తున్నాయి.
అదో కలవరమో, దుర్బలత్వమో
గుబురు చీకట్ల భయానక అస్తిత్వమో
ఎడారిపువ్వుల నిర్లిప్త ఒంటరితనమో మరి..
Hmmm,
as u r my better place..
కొన్ని మాటలతో సముదాయించి
గోరువెచ్చని కూనిరాగాలతో జోలపాడి
నా వెన్ను నిమిరే స్నేహం నువ్వే కదా
మొత్తంగా ముడుచుకుని
నీ రెప్పలకింద దాక్కుండిపోవాలని
పదేపదే అదే కోరిక తలపోస్తుంది మది
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment