నిదురేరాని నాకు కలలు రావనే కదూ
ఇష్టమైన పల్లవిలా
పదే పదే గుర్తుకొస్తావ్
విచ్చుకున్న పువ్వులా నవ్వి
ఎంత కాలమైందో
నీ నిశ్శబ్దానికేమైనా తెలుస్తుందా
క్షణమో యుగమై భారమవుతున్న
చలిరోజుల ఉక్కపోతలు
నీకసలు అనుభవానికొచ్చి ఉండవు
ఉప్పొంగుతున్న అలలకు దిగులేంటో
అడిగి చూడొకసారి
నిన్ను విడిచొచ్చిన నా వేదనకి
తాము సుళ్ళు తిరుగుతున్నాయని చెప్తాయి
వర్తమానాన్ని కోల్పోతున్నానని జాలిపడి
అక్షరం ఆసరా ఇవ్వబట్టి సరిపోయింది గానీ..
ఈ గుండె బరువుకి ఊపిరాగిపోయుండేది
No comments:
Post a Comment