1. అవధుల్లేని కాలం సమ్మోహనమై కదులుతున్నా
కొన్ని క్షణాలు మన అరచేతుల గుప్పిట్లోనే పదిలం చేసా
నిన్ను కలిసానన్న ఆనందమే లేకుంటే
ఈరోజు నాకెందుకింత విషాదం
2. సన్నని తెరలా కన్నీటి పొర కన్నుల్లో..
దానిమ్మపువ్వులా నీ నవ్వేమో,
అప్పుడెప్పుడో చిన్నప్పుడు లెక్కించిన తారలన్నీ
చీకటిలో నువ్వు లెక్కించ వీల్లేని కనుమెరుపులుగా..
3. నాలో నిరంతర ధ్యానమిక మొదలైనట్టే
మనసు వణికిన అలజడి తెలిస్తే ముందే చెప్పు
చిలిపి గుసగుసల కావ్యమొకటి కలిసే రాసుకుందాం
No comments:
Post a Comment