కలలన్నీ
సముద్రపు ఒడ్డునే ముగుస్తున్నా
వేకువకంతా పరిమళపు తోటల్లో మేల్కొంటున్నా
మంచు ముత్యాల్లో
నీ రూపాన్ని పోల్చుకుని సరదాపడినా
అవి అదృశ్యయ్యే వేళకంతా
గాయమై మిగులుతున్నా
భావమూ, బెంగా నీ మీదనే అయినా
కన్నూ, కన్నీరూ నాదే కదా
ఏమో..
హేమంతాన్ని పరితపించినంతగా
చలిని అలవాటు చేసుకోలేకపోతున్నా
No comments:
Post a Comment