Thursday, 9 December 2021
//నీ కోసం 409//
నీ పెదవులు అలసిపోవడం ఇష్టం లేక
నువ్వెక్కువ మాట్లాడకున్నా
ఆ మౌనాన్ని Synthesizerలో వినగలుగుతాను..
ఒక్కచూపు విరితూపుగా సొగసుకి సోయగమిచ్చావని
మళ్ళీమళ్ళీ నీ కన్నుల్లో ఒదగాలనే
పదేపదే anxiousగా పడిగాపులు కాస్తుంటాను
నిన్ను కలిసిన సాయింత్రపు గుండెల్లోని తత్తరపాటు
జ్ఞాపకాల అలలై ముంచెత్తినప్పుడంతా
తడిచి తడిచి emotionsని మోస్తుంటాను
ఆకాశంలా అందనంత దూరంగా నువ్వున్నా
కోరుకున్న క్షణంలో దగ్గరగా అనిపిస్తావని
విరహాన్ని withdraw చేసి చల్లబడుతుంటాను
అప్పుడప్పుడూ వచ్చే మేఘసందేశంలో
గొంతెత్తి పిలిచే నీ తీయని పిలుపులు వినబడి
ప్రణయావేశపు కొత్త lyricsని పాడుతుంటాను
ఏం బెంగపడొద్దని చెప్పావ్ కదా..
అందుకే మరి
నా చిరునవ్వుల్లో మొలకెత్తే నీ fragranceని
భావుకతగా తలచి ఆస్వాదిస్తుంటాను
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment