Thursday, 9 December 2021
//నీ కోసం 407//
సగంసగం అందీ అందని
ఆకుపచ్చటి కలలోని పులకరింతలా
ఎన్నినాళ్ళు నన్నిలా వెంబడిస్తావ్
పలకరింపు పేరుతో గుర్తుకొచ్చి
అభ్యంగనాంతరపు అమితమైన నిద్రాసక్తిని
ఏమీ తెలీనట్లు క్షణాలలో తుడిచిపారేస్తావ్
వారం వర్జ్యాల లెక్కలేకనే
అర్ధంకాని అనుభూతులు ప్రతిస్పందించినట్లు
నీ ధ్యాసలోని తీపిని మభ్యపెడుతుంటావ్
ఒక్కసారన్నా నాతో నన్ను గడపనీయక
నిశ్శబ్దాన్ని భగ్నం చేసినట్టు
నా ఆదమరుపుని అధాటుగా అల్లుకునేస్తావ్
అబ్బబ్బా..
ఏమంటున్నావో తెలుసులే
ఊపిరి తీయరాని హడావుడిలో నువ్వుంటే
అల్లరికాపు కాసి గుసగుసలు మొదలెట్టింది నేనేనని కదా !!
What to do..
I'm embraced by ur voice out of d blues
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment