Thursday, 9 December 2021
//నీ కోసం 408//
చుక్కలు మెరుస్తున్న నీలాకాశాన్ని చూడగానే
నీ జ్ఞాపకాల్లో నిలిచిపోతున్నా
నిన్ను ధ్యానించేందుకని అరచేతులు కలపుకోగానే
ఎంతకీ అంతమవని ఆ విశాల మైదానంలో
నేనూ పారదర్శకమై తప్పిపోతున్నా
నీ నవ్వులన్నీ తనే దాచుకున్నట్లు ఈ గాలి
నన్ను పులకరింతై చుట్టుకుని పట్టుతప్పిస్తున్న సమయం
నా పెదవంచున నీ కవిత్వపు సుతారాన్ని పాడుతున్నా
ఈ పువ్వులకింత గంధం ఎక్కడిదోనని
నిశ్శబ్దం రాల్చుతున్న వివశత్వపు పుప్పొడికి
అరమోడ్చుతున్న కళ్ళనూ మూయలేకున్నా
నిద్రపట్టని రాత్రులన్నీ ఇంతే..
ఎక్కడో ఉన్న నువ్వు నా నిరీక్షణా క్షణాల సవ్వడికి
చీకటిగుహలోంచీ వాస్తవంలోకొస్తావని
ఆత్మరతిని కొనసాగిస్తున్నా..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment