Thursday, 9 December 2021
//నీ కోసం 418//
ఎంతగా మారిపోయింది నీ నవ్వు
నిద్దురలో నేను ఉలిక్కిపడేలా
కలల్లో వెతుక్కుంటూ మరీ వచ్చి
ముద్దు చేసే ఆ పెదవుల భాష మూగబోయింది
మన కనుపాపల కేరింతల్లో
కాలం కరిగి కొన్ని మౌనాలకి మాటసాయమై
ఒకరినొకరు ఇష్టంగా చదువుకున్నప్పుడు
మనసులోపలి చిలిపిదనం
కన్నుల కొసమెరుపుగా వెలిగి
నారింజ సాయింత్రంలా ఉండేది కదూ
వెలుతురు నుంచి చీకట్లోకి దూకుతూనే
రెప్పలకు వేళ్ళాడుతున్న మత్తునాపుకుంటూ
వెచ్చని పాటల్లోకి వలస పోయినప్పుడేమో
తమకంతో తూలిపోయే రాగాలుగా
అనంతానంత లోకాల్ని పరిచయించి
ఎదలోయల్లో వెన్నెల గుమ్మరించేది కూడా
Hmm .. సరేలే..
దిగులు దాటేందుకు ఇంకో నాలుగడుగులు
గాయాన్ని కొంత మాననీ
తడిచూపు తేలికై తరంగమైనప్పుడు అదే తిరిగొస్తుందిలే
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment