శీతాకాలం చలిగాలికేం చెప్పావో
నా గదిలో వెచ్చదనానికి విలువనిచ్చి
చప్పుడు చేయకుండా తప్పుకుంది
నువ్వు చెప్పినందుకే
క్షణాల్ని 'క్షణాలు'గా అనుభవిస్తున్నానా..
నీ ఆత్మపరిచయంగా
నువ్వు పాడిన జోలపాటకి స్పందించేందుకే
నిద్రలోకి జారేందుకు చూస్తున్నా..
ఏమో..
ఏకాంతానికి విసుగొచ్చి
కాలాన్ని కదలమన్నా కానీ కదలనందుకేమో..
నీ విరహమ్మాత్రం నిర్విరామంగా
కనురెప్పలను కలవకుండా చేస్తుంది
No comments:
Post a Comment