మదిలోని వెలితి మధురమయ్యేందుకేమో
పగలంతా నన్నొంటరిని చేసిన బదులుగా..
అందమైన నీ ఆకాంక్షలన్నీ మాలగుచ్చి మరీ
రాత్రి కల్లోకొచ్చి కబుర్లుగా చెప్తావ్
నిశ్శబ్దరాగానికి చినుకు ముత్యాలెన్ని కలిసాయో
చెప్పలేని మాటలన్నీ వానపాటలై వినబడి..
నీ చిరునవ్వుల ధారాపాతంలో
నే తడిచినట్టు కనుపాపల్లో మెరుపులవుతాయ్
నువ్వున్నావే..
వివశాన్ని పొందికగా దోబూచులాడాలనేమో
సరాగాలు సంపెంగి వాసనయ్యేలా..
వలపుని కలబోసి.. హృదయంలో చోటిచ్చి
అసలెందుకు అలిగానో మర్చిపోయేలా చేస్తావ్
No comments:
Post a Comment