నీ మదిలోని ఆర్తి శబ్దరహిత భాషలో
నన్నావరించినప్పుడే నిన్ను పోల్చుకున్నా
ఏకాంతంలో నన్ను గమనించేంత తీరికా, ప్రేమా
నీ ధ్యానంతోనే నాకందిపోతుంది చిత్రంగా
నీ చూపులు నన్ను భద్రంగా దాచుకున్నాయని
మిలమిలా ఆ కళ్ళు నవ్వినప్పుడే తెలుసుగా
జ్ఞాపకమయ్యేంత దూరంలో నువ్వెప్పుడూ లేవని
ఎన్ని పాటలు పాడి చెప్పనూ..
అయినా, ఈ వేకువలూ, సాయింత్రాలు దాటి
కాలాతీత కావ్యమయ్యావు కదా నువ్వెప్పుడో
No comments:
Post a Comment