మనసు తెరిచుంచా రమ్మని పిలిచి
మాటలకి తాళమేసి బజ్జున్నావా
గుట్టుగా గుండెలో దూరిపోమని చెప్పి
గుబుళ్ళకి నన్నొదిలేసి మాయమవడం గొప్పనా
అల్లిబిల్లి అల్లరంతా పిడికిట్లో నలిగి
అలుకలతో కలతపడుతుంది ఏమైనా తెలుసా
నునుసిగ్గులు దాచుకున్న కళ్ళల్లో ఎరుపుకాస్తా
కరిగి ఉదయానికి ఏరయ్యేట్టుంది కనికరించవా
No comments:
Post a Comment