నీ రాకతో
నా చిన్ని హృదయం
చిరునవ్వుల వెలుగుతో చీకటిని తరిమింది
ఇప్పటిదాకా పరాయిని చేసిన సంతోషం
ప్రేమగా దగ్గరకొచ్చింది
గుండెచప్పుడు ఆలకించేందుకు
నువ్వొచ్చావని తెలిసాక
మనసు కూడా మౌనం వీడి
నీతో గుసగుసలాడుతూ నిద్రపుచ్చాలని
కొత్తకొత్త ఊసులను పోగేస్తుంది
పిలవగానే పలికావు కాబట్టి సరిపోయింది
లేదంటే నీ పిలుపు కోసం
కలతపడ్డ రాత్రితో పెనుగులాడవలసి వచ్చేది
బరువెక్కే సమయమయ్యింది
బెంగ లేదిక..నువ్వొచ్చేసావుగా.
No comments:
Post a Comment