Wednesday, 6 May 2020
// నీ కోసం 148 //
సోమరిగా మొదలైన తొలిపొద్దు
చలచల్లగా కదులుతూ
సాయింత్రానికి నిలకడ లేని అలలా
సంగీతాన్ని ధ్వనిస్తూ ఉంది
వర్షాకాలం సందడి మొదలయ్యిందిి కదాని
ఏ మొక్కని పలకరించినా
వానంటే నీకెంతిష్టమో చెప్తుంది
అవునా..
విరామమన్నది లేకుండా కురిసే ఈ జల్లులో
నీ నిరీక్షణా రహస్యం దాగుంటే
విరహమన్నది నీకు వ్యాపకం కదా
మరైతే..
నువ్వు అనాలనుకున్న తీయని మాటలు
కళ్ళు మూసుకుని నేనాలకిస్తున్న
చినుకు శబ్దంలో కలిసి గలగలమని
కొత్తరాగాలుగా నన్ను మెలిపెడుతున్నవెందుకో
కొన్ని యుగాలుగా శూన్యమైన కలలకు
పరిమళం పువ్వులకి మాత్రమే రాదని నచ్చజెప్పాలి
ఇంతకీ..
నీ గడపకివతల నిలబడ్డ నేనెవరినో చెప్పవూ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment