నా కన్నుల వెన్నెల్లో విశ్రాంతి తీసుకుంటున్న
నీ దేహాన్ని చూసావా..
కొంచం చోటివ్వగానే..కలలోంచీ నువ్వు నడిచొచ్చినట్లు..
ఇప్పుడు నీ చిరునామా నేనైపోయా గమనించు..
నరాల్లోకి అనుభవానికొచ్చిన సంగీతానికేమో
రేయింబవళ్ళూ నిన్నే సాధన చేస్తూ నేనలసిపోతున్నా చూడు..
నీ మనసులోని లోతైన ఆకర్షణ..నా మౌనంలో ఇంకినందుకే
ఓ అలౌకిక రసనావస్థలో తేలిపోతున్నా గామోసు..
ప్రేమాన్వీ...
No comments:
Post a Comment