Sunday, 26 February 2023
// నీ కోసం 510//
నీ గుండెగదిలోకి తొంగిచూసి చానాళ్ళయింది
మౌనం ఘనీభవించి భావావేశాలు బరువయ్యాక
మాటల శబ్దం సద్దుమణిగింది కదా
హృదయాన్నావరించిన దిగులు మేఘమేదో
చడీచప్పుడు లేక విషాదాన్ని నిట్టూర్చుతూ
దీర్ఘరాత్రుల అలుపుని పెంచుతుంది తెలుసుగా..
Pch.. నా కనురెప్పల పడవల్లో నిన్ను సేదతీర్చి
అలౌకిక తీరాలకు చేరేలోపు
ఆపుకోలేని మత్తు ఆవహిస్తుంటుంది
అయినా..
ఇంత తీపి బాధ కలిగి ఎన్నాళ్ళయింది..
శరత్కాలమంటే మబ్బు తొలగిన రాత్రుళ్ళు
మనసంతా వెన్నెల చిరునవ్వుతున్న అల్లర్లు కదా
ఏమో.. కవిత్వంతో కబుర్లాపి చాలా కాలమయినా
నీలోంచీ నన్ను తీసే విశాలత్వం
ఏ వాక్యానికి లేదని తెలిసిపోయింది
Ofcourse agreed..
Sometimes u have to forget what u feel
to remember what u deserve
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment