Saturday, 25 February 2023
//నీ కోసం 505//
కలలో విరహించీ విహరించీ విడిపోయి
ఓ కొత్త కావ్యంలా కలగలిసే ఊహలన్నీ
నీ జ్ఞాపకాల పొగడదండలేనా
మనసొక్కసారి మధురానగరిగా మారిపోయిందంటే
మలయమారుతానికి గంధం కలిపి
ఇటువైపు పంపించింది నువ్వేనా
నా అంతర్వాణి పలవరిస్తున్న
వెచ్చని ప్రేమకెరటంలాంటి మృదుస్పర్శ
నీ కనురెప్పల సీతాకోకచిలుకలదేనా
పగలో రేయో గుర్తుకురాని
ఈ క్షణాల మోహరింపు
తీయని నీ మనస్సంగమ ఉప్పెనలోని మైకమేనా
ప్రేమాన్వీ..
సున్నితమనిపిస్తూనే విదితమవని నీ మిధ్యాభావం
లాలిత్యమైన ఈ సాన్నిహిత్యమేమో నాకదో మానసికారాధనం
U r like a winter evening n
I will b a poet with ur language of love
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment