Sunday, 26 February 2023
// నీ కోసం 509//
1. ఒక్కోరోజు పగలు ముగియకుండానే వానపడుతూ
సగం సగం జ్ఞాపకాల వరదలో
నన్ను ముంచి తేల్చుతుంది
2. అంతులేని విచారానికి భాషలేక
భావాన్ని దరిచేరని వాక్యంలా
ఆదమరచిన అంతరాత్మనై వణుకుతున్నానేమో..
మిణుగురులై మెరిసే నీ కళ్ళు
చీకటి నిండిన నా ఏకాంతాన్ని వెలిగించి
కాసేపలా వెచ్చదనాన్నీ వెదజల్లుతాయి
3. నిశ్శబ్దంతో రాజీపడి
హృదయాన్ని అన్ని రాగాలకూ దూరం చేసినా
నీ పాట కోసం కలల్లోనూ తపనపడుతున్నానని తలపోసానేమో..
ఆకుల్లో సంగీతం వినబడుతున్న ఆనందం
ఇన్నాళ్ళకు తెలుస్తుంది
ప్రేమాన్వీ..
నన్ను తలచుకుని నువ్వేమైనా చిరునవ్వు చిందావా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment