శిశిరం చేస్తున్న చప్పుళ్ళలో
ఏ రాగం వినబడిందో
మాఘమాసం పులకరిస్తూంది
పున్నమినాటి వెన్నెల వాసనేమో
కాసేపైనా నిట్టూర్పులనాపి
ఆదమరపుకి రమ్మంటుంది
వెలుతురుచ్ఛాయల్లో నీ మౌన నిశ్చలత్వమేదో
నా ఏకాంతవాసపు చంద్రోదయానికి
మాటలకందని నిర్మోహత్వమౌతుంది
ఓహ్హ్.. చెదిరిన చీకట్లలో ప్రేమరసం
అమృతాన్ని పొంగించినందుకు
తడియారని చూపుల్లో చిరునవ్వు కిలకిలవుతుంది
No comments:
Post a Comment