ఎవరీ చక్కనివాడు.. ఎంతకీ చిక్కనివాడు
పగలంతా పక్కనే ఉండి..
రాత్రైతే రెప్పలచాటుకెళ్తాడు
నవరసాల నవ్వుల్తో పిల్లంగోవి లేకపోయినా
ఆ నల్లనయ్యని తలపిస్తాడు
వెయ్యి జలపాతాల వేగాన్ని తలపిస్తూ
వెక్కిళ్ళు పుట్టిస్తుంటాడు
పచ్చిమిర్చిబజ్జీలా పొగరుగా ఉంటూ
పంచదార చిలకలా సిగ్గుపడతాడు
తనువూపే రహస్యం తెలీదంటూనే
పన్నీటి రాగడోలల్లో తేలిస్తాడు
చూస్తూ చూస్తూ ఊపిరాగిపోతేనేం
కోరగా కన్నుగీటి ప్రాణం పోసేట్టుంటాడు
నిజంగా..
ఆదమరవని ఆనందాల మైకం వాడు
విస్మరించ వీలులేని తీయనివిరహం వాడు
No comments:
Post a Comment