వరిచేలతో పోటీగా ఉన్న అందమది
ఏం వారసత్వమో..
పచ్చపచ్చగా ఉన్న నిన్ను చూస్తూ
ఆ ఒంటి సువాసనలూహిస్తుంటే
వలపు వేడి సెగలుగా మారి
నిదురకు నన్ను దూరం చేస్తుంది
వసంతకాలం ముందే వచ్చింది
విరహగీతాల్ని ఆపమనేమో..
మంచిరోజు చూసుకు మరీ
మదిలోని పులకరింతలు బయటపడుతుంటే
చెక్కిలి మీది చిరుచెమటలు
చీకటిలోనూ మెరుస్తున్నవనేం చెప్పనూ..
No comments:
Post a Comment