ఈ రాత్రి..
చిందరవందరగా చలిగాలి
పొగమంచుగా అలుముకుని
మసకచీకటిని మరింత ఆవిరిపట్టించింది
హేమంతమింకా మొదలవకుండానే
గుండెకు తడబాటు ఎక్కువై
తీపి నీ జ్ఞాపకాల కోసమని
అదేపనిగా సుషుప్తిలోకి జారిపోతుంది
గాఢమైన నా నిరీక్షణలో
నీ తలపుల ప్రేమగీతిక
స్వరజతుల పులకరింపులా
తమకంతో నన్నూయలూపుతుంది
నీ ఉనికి ఉప్పొంగినప్పుడంతా
మోహాల తీరం వెంబడి మనసు
అసంకల్పిత భావనా ప్రపంచాన్ని చేరి
కాలంతో కరుగుతూ సోలిపోతుంది
అమ్మూ..
కనీకనిపించని పగటి చంద్రికలా
ఎందుకలా వెంటాడుతావ్ నన్ను
No comments:
Post a Comment