ఇప్పుడెలా ఉన్నానో చెప్పాలి
ఊహకందని ఓ తన్మయావస్థలో
అత్తరుమత్తుని ఆవహించిన
సన్నజాజి కొమ్మలా ఊగుతున్నా
నీ గుండెల్లో దాగి ఉన్న తహతహలు
రంగురంగులుగా నాపై చల్లినట్టు
చిరునవ్వులనే గొంతెత్తి పాడుతున్నా
చానాళ్ళుగా చుట్టూ ప్రవహిస్తున్న శూన్యం
కలతల్ని దాటి విస్తుపోయేలా
నీ ముద్దుమాటలతో నింపుతున్నా
మెత్తగా కలల్ని దోచుకుపోయే నీ చూపులు
అస్తవ్యస్తపు అలలై నన్ను తడిపినట్టు
ఊపిరందని బిడియమై పులకిస్తున్నా
I think ur majic started already
No comments:
Post a Comment