ఎక్కడో ఉంటారు ఆ ఒక్కరు..
అదృశ్యంగా మనసుని మాయ చేస్తారు..
అదృశ్యంగా మనసుని మాయ చేస్తారు..
విరినవ్వుతో మల్లెలు పూయించేవారు
కొనచూపుతో కలల తీరానికి చేర్చేవారు
చేయిపట్టి ప్రేమవనమంతా తిప్పేవారు
కొనచూపుతో కలల తీరానికి చేర్చేవారు
చేయిపట్టి ప్రేమవనమంతా తిప్పేవారు
శిశిరపు అలజడిలో నువ్వుంటే వసంతాన్ని వివరించేవారు
మారాకు వేసిన మనోవేదన మెత్తగా తుడిచేవారు
నీ ఏకాంత క్షణాన ఆటవిడుపుగా కలదిరిగేవారు
మారాకు వేసిన మనోవేదన మెత్తగా తుడిచేవారు
నీ ఏకాంత క్షణాన ఆటవిడుపుగా కలదిరిగేవారు
నీ మూగబోయిన వీణ తీగలను సవరించి
సరికొత్త రాగాలను కూర్చేవారు
సరికొత్త రాగాలను కూర్చేవారు
చెమ్మగిల్లిన నీ ఊహలను తడియార్చి
మౌనంగా మధురకావ్యాన్ని రాసేవారు..
మౌనంగా మధురకావ్యాన్ని రాసేవారు..
ఇక్కడే మన పక్కనే ఉంటారు..
దోబూచులాడుతూ మనలోనే మమేకమవుతుంటారు..
దోబూచులాడుతూ మనలోనే మమేకమవుతుంటారు..
ఉదయాస్తమానాలు సరిపోనంత గమ్మత్తుగా
ఊసుల ఊయలూపి జీవనోల్లాసాన్ని నింపేవారు
No comments:
Post a Comment