కాసేపు నీకు దూరమవ్వాలని కల్పనలన్నీ కట్టిపెట్టానా..
నాకంటూ వేరే వ్యాపకముందేమోనని
ఆలోచన మొదలుపెట్టగానే ఆ పరీవృత్తం పూర్తయ్యేలోగా
వెనుదిరిగి చూసినప్పుడు నువ్వే..
ఒంటరి నక్షత్రాన్ని విశాలమైన ఆకాశానికి వదిలి
నీ మానాన నువ్వు అనుభవాలకని పయనిస్తే
నిజం చెప్పు..ఆగిపోయిన కాలంలో నా నడకలెటు వేయనని ప్రశ్నిస్తావు
మౌనమంటే మక్కువంటూనే మాట కలపలేదని ముభావిస్తావు
ఒంటరిగా వదిలేయమంటూనే..నువ్వులేని ఏకాంతం నాకెందుకంటావు
అర్ధం కాని కోణాలింక చూపకు
నావెంటే నువ్వున్నావన్న నమ్మకాన్నే శ్వాసించనివ్వు
కాస్తంత ధ్యానమంటూ నే చేసానంటే
అది నీకోసమేనని సంతోషించు..:)

No comments:
Post a Comment