సన్నని తెరలా కన్నీటి పొర కన్నుల్లో
నిజానికి నాకిదో తన్మయత్వపు తొలిరేయి
మెడవంపులో నీ పెదవుల కచేరీ గుర్తొచ్చి
నిజానికి నాకిదో తన్మయత్వపు తొలిరేయి
నీ అపురూప స్పర్శతో నిలువెల్లా నే పులకించిన హాయి
అప్పుడెప్పుడో చిన్నప్పుడు లెక్కించిన తారలన్నీ
చీకటిలో నువ్వు లెక్కించ వీల్లేని కనుమెరుపులుగా
నన్ను తడిమిన ప్రతిసారీ..దానిమ్మపువ్వులా నీ నవ్వు, చీకటిలో నువ్వు లెక్కించ వీల్లేని కనుమెరుపులుగా
వెన్నెల్లో నా నిద్ర చెదిరినప్పటి సంతోషపు రహస్యం తెలుసా
నడిరేయి నా కలస్వనాల తమక గమకాలు మిన్నంటేలా
సగం మబ్బుగా మారి నన్ను కమ్ముకున్న నీ దేహం
నన్ను పూర్తిగా తడిపి నిలిపిందన్నది వాస్తవం.
ఊపిరి తగిలేంత దగ్గరలో పెరిగిన హృదయస్పందననన్ను పూర్తిగా తడిపి నిలిపిందన్నది వాస్తవం.
ఇప్పటికి మోయలేని విరహమై వేధిస్తున్న తీయని భావన
అవధుల్లేని కాలం సమ్మోహనమై కదిలినా
కొన్ని క్షణాలు మన అరచేతుల గుప్పిట్లోనే పదిలం చేసా
కొన్ని క్షణాలు మన అరచేతుల గుప్పిట్లోనే పదిలం చేసా
నిన్ను కలిసానన్న ఆనందమే లేకుంటే
ఈరోజు నాకెందుకింత విషాదం
ఈరోజు నాకెందుకింత విషాదం
నాలో నిరంతర ధ్యానమిక మొదలైనట్టే
మనసు వణికిన అలజడి తెలిస్తే ముందే చెప్పు
మనసు వణికిన అలజడి తెలిస్తే ముందే చెప్పు
No comments:
Post a Comment