My feelings after reading your tender Poetry Raj Reddy garu.. can't wait sharing with you and your dear friends..☺️💐
అదో సుందర ఉద్యానవనం
ఎటుచూసినా మనోజ్ఞ పదాల పువ్వులు..విరిసీ విరియకనే ఆకర్షించే చెంగలువల పరిమళమంత స్వచ్ఛమైన ప్రేమావిరులు..
చదివేకొద్దీ మతిచెడుతూ..లేని విచారం పోగవుతూ..ఉన్న దిగులు మాయమవుతూ..
ఓ సున్నితమైన తపన..రణగొణ మర్మ ధ్వనుల నడుమ తీపి గుర్తుల ఆహ్లాదాన్ని పెనవేసే వివశత్వ రాగం..సంగీతాన్ని మించి ఓలలాడించే లాలిత్యం..
గుమ్మపాల తీయదనాన్ని ఇష్టంగా పెదవులకందించే సోగతనం ఈ కవితల్లో
ఏమో..మెలికలు తిరిగిన మల్లెతీగలా మనసుని అల్లుకున్నదంటే అదో ఏకాంతపు ద్వీపంలో పన్నీటి జల్లుల కలస్వనమే..
పరిచయమవసరం లేని ఈ సుదీర్ఘ పూలచెండు "రాజ్" గారి సహజమైన జాజిపూల జోలపాట నాకైతే...😍
ఋతువు కాని ఋతువులో గుండెల్లో మొదలైన తడిలో ప్రణయమనే చిన్నారి చిగురించి గొంతులో అడ్డుపడినప్పుడు స్వప్నమొకటి స్మృతిలోకొచ్చి పొలమారితే.. తనో ప్రేమైక ప్రపంచానికి రారాజునని ప్రకటించుకుంటూనే..రహస్యమైన ఆ ప్రేమనిలా ఆరా తీసారు..
"ఏర్పడేటప్పుడు తెలియకుండా
తెలిశాక ఇక మరపుకు రాకుండా
అనంతమే తనతో తాను ప్రేమలో పడే ప్రేమలో,
కనులు దిగమింగుకున్న కన్నీరో లేక పన్నీరో
మనసులో చేసిన తడిలో మొలకెత్తిన ప్రేమ విత్తు...
...ఎవరికి తెలుసు, ఎవరు ఎప్పుడు ఎందుకు నాటారో..?!"
పగలూ రేయిని పదప్రయోగించి తను చేసే అద్భుతం క్రమం తప్పని మృదు జీవరాగం.. చీకటి కురిసే రాత్రి ఉదయానికి అదృశ్యమై ఓ రసోదయమైతే ..ప్రతిరోజూ ఓ ఉత్సవానికి సిద్ధమన్నట్టు.. ఆ మోహనాన్నిలా స్వరపరిచారు.
"ఏ ఆనవాళ్లూ ఆకాశంలో మచ్చుకైనా కనబడకుండా
మరే చీకటి శకలాలూ పొరబాటునైనా మిగిలిపోకుండా...
రహస్య ప్రియుడిలా రోజూ లోకంతో రమించి వెళ్ళే రాత్రిని
పట్టుకోలేక తెల్లబోవడమే... తెల్లవారడమంటే..! "
ఎంతందమైన భావన కదూ..
మంజులమైన మృదుభాషణ.. హృదయం తడిచి ముద్దయ్యే నవ్వులూ..హరివిల్లు ఊయలై ఆకాశానికి చేరువగా ఊపినట్టు..వెన్నెల చినుకుల్లో రేయి కలలకు రంగస్థలమేసినట్టు..కళ్ళతో నవ్వే కనికట్టు తన అక్షరాలకు మాత్రమే సొంతమైనట్టు విరాజమానమైన రాజసం..స్పృసించే ప్రతి అంశమూ అనుపమేయమే..💜
కన్మణి అనేది కంటిపాపై తనలో ఒక భాగమైనట్టు అతని నిత్యపోషణ చేయడంలో నూరుపాళ్ళు సఫలీకృతమయ్యింది. ఊహాతీతమైన చిత్త సంచలనాన్ని ఆమె ఉనికిగా మనకి పరిచయించి హృదయబంధానికున్న విలువను ఆసాంతం అనుభూతించేలా చేసారు.
మరపురాని జ్ఞాపకాలన్నీ మాల కడితే ఆ జిగిబిగి సౌందర్యాతిశయం తడమకుండానే ఓ పులకరింపై ఎదను తాకినట్టు..ఎడబాటు సహించలేని విషాదం అమాయకమైన ప్రశ్నలతో కలిసి ఓ అపురూప ఊహాగానమై మనసుని వేధిస్తూనే మురిపిస్తుంది..
"నీ పాద ముద్రలను
ఇముడ్చుకుని ఉన్న వీథులను
నా చూపులకు అతికించి,
నీ అడుగుల చప్పుడుకు
అలవాటు పడిన నా వినికిడికి
ఎదురుచూపులను మిగిల్చి,
ఎక్కడికెళ్ళావు???"
ఇంతకన్నా హృద్యంగా ఎవరు పలవరించగలరు..😊
అలాగే కన్మణి నవ్వులంటే తనకెంతిష్టమో..అరనవ్వులకే వశమైపోతూ ముందుకు వెళ్ళలేక ప్రియమైన సంగీతన్ని సాహిత్యాన్ని కలగలిపి పోల్చుకుంటూ నిలబడి మరీ అచ్చెరువొందినట్టు..గుండె పట్టనన్ని ఆ ఊహలు కలలో నిజం చేసుకోవాలనుందంటూ రాత్రిని త్వరపడమని కబురు పెడతారు. నిద్రకళ్ళతో కౌగిలించుకున్న ఆ స్వప్నాల ఋజువులు అక్షరాలుగా అనువదించి తిరిగి రసహృదయులకు అంతే ప్రసాదంగా పంచిపెడతారు. మౌనమో నేపథ్యంగా ఆ నవ్వులు ప్రవహించే తీరు గుసగుసలకన్నా మెత్తనైన సవ్వడిని మనసుకందిస్తుందంటే సందేహం లేదు.
"దూరాన్ని చప్పున దగ్గరచేసే
మంత్రం లాంటి
నీ నవ్వు గుర్తొచ్చినప్పుడల్లా;
దూరపు చేతులతో
జ్ఞాపకాలను తడుముకుంటూ
నీ దగ్గరితనాన్ని అనుభవిస్తున్నా!"
"సగం సగం దొరికేవన్నీ మిగతా సగాల కోసం పరిగెత్తించవని..నన్ను ఉన్నచోటే నిలువరించి నమ్మించే నీ అరనవ్వు గుర్తొచ్చి..రోజులో మిగిలిపోయిన ఖాళీలన్నీ పూరించేసుకుంటాను.. !"
చెప్పేదేముంది..
ప్రతి కవితలోనూ వైవిధ్యం..జీవితంతో మమేకమైన సృజనానుభవం..
ఇదంతా ఒక ఎత్తైతే..ఇన్ని భావాలను అపురూపంగా ఆలింగనం చేసుకొనేందుకు నిస్స్వార్ధమైన నేస్తాలు..మాటలకందని ఉత్సాహాన్ని ప్రోత్సాహంగా గుప్పించి కేరింతలు కొట్టే చందన హృదయాలు. ఎన్నో మనోభావాల వెల్లువలు ఇష్టంగా ముంచెత్తినప్పుడు మునకేయాలని కోరుకోని సమ్మోహనులెవ్వరు..?!
ఒక్కో కవనాన్ని విప్పార్చి చూసేకొద్దీ నిండే హృదయపు బరువు తూచుకొనేందుకు అదో సంక్లిష్టం..ఇప్పటికిదో సశేషం..
ఉద్యోగ ధర్మం కోసం ముఖపుస్తకానికి కాస్త విరామమిచ్చినా తిరిగి మరిన్ని చక్కని భావాలసందడితో త్వరలో విచ్చేయగలరని ఆశిస్తూ..మనఃపూర్వక అభినందనలు..☺️💐
అదో సుందర ఉద్యానవనం
ఎటుచూసినా మనోజ్ఞ పదాల పువ్వులు..విరిసీ విరియకనే ఆకర్షించే చెంగలువల పరిమళమంత స్వచ్ఛమైన ప్రేమావిరులు..
చదివేకొద్దీ మతిచెడుతూ..లేని విచారం పోగవుతూ..ఉన్న దిగులు మాయమవుతూ..
ఓ సున్నితమైన తపన..రణగొణ మర్మ ధ్వనుల నడుమ తీపి గుర్తుల ఆహ్లాదాన్ని పెనవేసే వివశత్వ రాగం..సంగీతాన్ని మించి ఓలలాడించే లాలిత్యం..
గుమ్మపాల తీయదనాన్ని ఇష్టంగా పెదవులకందించే సోగతనం ఈ కవితల్లో
ఏమో..మెలికలు తిరిగిన మల్లెతీగలా మనసుని అల్లుకున్నదంటే అదో ఏకాంతపు ద్వీపంలో పన్నీటి జల్లుల కలస్వనమే..
పరిచయమవసరం లేని ఈ సుదీర్ఘ పూలచెండు "రాజ్" గారి సహజమైన జాజిపూల జోలపాట నాకైతే...😍
ఋతువు కాని ఋతువులో గుండెల్లో మొదలైన తడిలో ప్రణయమనే చిన్నారి చిగురించి గొంతులో అడ్డుపడినప్పుడు స్వప్నమొకటి స్మృతిలోకొచ్చి పొలమారితే.. తనో ప్రేమైక ప్రపంచానికి రారాజునని ప్రకటించుకుంటూనే..రహస్యమైన
"ఏర్పడేటప్పుడు తెలియకుండా
తెలిశాక ఇక మరపుకు రాకుండా
అనంతమే తనతో తాను ప్రేమలో పడే ప్రేమలో,
కనులు దిగమింగుకున్న కన్నీరో లేక పన్నీరో
మనసులో చేసిన తడిలో మొలకెత్తిన ప్రేమ విత్తు...
...ఎవరికి తెలుసు, ఎవరు ఎప్పుడు ఎందుకు నాటారో..?!"
పగలూ రేయిని పదప్రయోగించి తను చేసే అద్భుతం క్రమం తప్పని మృదు జీవరాగం.. చీకటి కురిసే రాత్రి ఉదయానికి అదృశ్యమై ఓ రసోదయమైతే ..ప్రతిరోజూ ఓ ఉత్సవానికి సిద్ధమన్నట్టు.. ఆ మోహనాన్నిలా స్వరపరిచారు.
"ఏ ఆనవాళ్లూ ఆకాశంలో మచ్చుకైనా కనబడకుండా
మరే చీకటి శకలాలూ పొరబాటునైనా మిగిలిపోకుండా...
రహస్య ప్రియుడిలా రోజూ లోకంతో రమించి వెళ్ళే రాత్రిని
పట్టుకోలేక తెల్లబోవడమే... తెల్లవారడమంటే..! "
ఎంతందమైన భావన కదూ..
మంజులమైన మృదుభాషణ.. హృదయం తడిచి ముద్దయ్యే నవ్వులూ..హరివిల్లు ఊయలై ఆకాశానికి చేరువగా ఊపినట్టు..వెన్నెల చినుకుల్లో రేయి కలలకు రంగస్థలమేసినట్టు..కళ్ళతో నవ్వే కనికట్టు తన అక్షరాలకు మాత్రమే సొంతమైనట్టు విరాజమానమైన రాజసం..స్పృసించే ప్రతి అంశమూ అనుపమేయమే..💜
కన్మణి అనేది కంటిపాపై తనలో ఒక భాగమైనట్టు అతని నిత్యపోషణ చేయడంలో నూరుపాళ్ళు సఫలీకృతమయ్యింది. ఊహాతీతమైన చిత్త సంచలనాన్ని ఆమె ఉనికిగా మనకి పరిచయించి హృదయబంధానికున్న విలువను ఆసాంతం అనుభూతించేలా చేసారు.
మరపురాని జ్ఞాపకాలన్నీ మాల కడితే ఆ జిగిబిగి సౌందర్యాతిశయం తడమకుండానే ఓ పులకరింపై ఎదను తాకినట్టు..ఎడబాటు సహించలేని విషాదం అమాయకమైన ప్రశ్నలతో కలిసి ఓ అపురూప ఊహాగానమై మనసుని వేధిస్తూనే మురిపిస్తుంది..
"నీ పాద ముద్రలను
ఇముడ్చుకుని ఉన్న వీథులను
నా చూపులకు అతికించి,
నీ అడుగుల చప్పుడుకు
అలవాటు పడిన నా వినికిడికి
ఎదురుచూపులను మిగిల్చి,
ఎక్కడికెళ్ళావు???"
ఇంతకన్నా హృద్యంగా ఎవరు పలవరించగలరు..😊
అలాగే కన్మణి నవ్వులంటే తనకెంతిష్టమో..అరనవ్వులకే వశమైపోతూ ముందుకు వెళ్ళలేక ప్రియమైన సంగీతన్ని సాహిత్యాన్ని కలగలిపి పోల్చుకుంటూ నిలబడి మరీ అచ్చెరువొందినట్టు..గుండె పట్టనన్ని ఆ ఊహలు కలలో నిజం చేసుకోవాలనుందంటూ రాత్రిని త్వరపడమని కబురు పెడతారు. నిద్రకళ్ళతో కౌగిలించుకున్న ఆ స్వప్నాల ఋజువులు అక్షరాలుగా అనువదించి తిరిగి రసహృదయులకు అంతే ప్రసాదంగా పంచిపెడతారు. మౌనమో నేపథ్యంగా ఆ నవ్వులు ప్రవహించే తీరు గుసగుసలకన్నా మెత్తనైన సవ్వడిని మనసుకందిస్తుందంటే సందేహం లేదు.
"దూరాన్ని చప్పున దగ్గరచేసే
మంత్రం లాంటి
నీ నవ్వు గుర్తొచ్చినప్పుడల్లా;
దూరపు చేతులతో
జ్ఞాపకాలను తడుముకుంటూ
నీ దగ్గరితనాన్ని అనుభవిస్తున్నా!"
"సగం సగం దొరికేవన్నీ మిగతా సగాల కోసం పరిగెత్తించవని..నన్ను ఉన్నచోటే నిలువరించి నమ్మించే నీ అరనవ్వు గుర్తొచ్చి..రోజులో మిగిలిపోయిన ఖాళీలన్నీ పూరించేసుకుంటాను.. !"
చెప్పేదేముంది..
ప్రతి కవితలోనూ వైవిధ్యం..జీవితంతో మమేకమైన సృజనానుభవం..
ఇదంతా ఒక ఎత్తైతే..ఇన్ని భావాలను అపురూపంగా ఆలింగనం చేసుకొనేందుకు నిస్స్వార్ధమైన నేస్తాలు..మాటలకందని ఉత్సాహాన్ని ప్రోత్సాహంగా గుప్పించి కేరింతలు కొట్టే చందన హృదయాలు. ఎన్నో మనోభావాల వెల్లువలు ఇష్టంగా ముంచెత్తినప్పుడు మునకేయాలని కోరుకోని సమ్మోహనులెవ్వరు..?!
ఒక్కో కవనాన్ని విప్పార్చి చూసేకొద్దీ నిండే హృదయపు బరువు తూచుకొనేందుకు అదో సంక్లిష్టం..ఇప్పటికిదో సశేషం..
ఉద్యోగ ధర్మం కోసం ముఖపుస్తకానికి కాస్త విరామమిచ్చినా తిరిగి మరిన్ని చక్కని భావాలసందడితో త్వరలో విచ్చేయగలరని ఆశిస్తూ..మనఃపూర్వక అభినందనలు..☺️💐
No comments:
Post a Comment