Friday, 24 May 2019

//నీ కోసం 3//

సలుపుతున్న సమయాన్నడుగుతున్నా
ఎందుకింత నెమ్మదిగా కదులుతున్నావని
మాటలు దూరమైన రాతిరి
దాగుడుమూతలు ఆడలేననంటూ కలెటో మాయమయ్యాక
అనుసరించేందుకేదీ లేదని సమాధానమిచ్చింది
మనసు చాటు ఓరగా నిలబడ్డ నీకు
ముఖం చూపలేక తలుపేసుకున్నాను
పరధ్యానాన్ని సహించలేని నువ్వు
మెలకువలో పిలిచి నాలుగు చీవాట్లేసినా బాగుండేది
ఇంకెప్పుడూ అర్ధంలేని ప్రశ్నలవైపు పోనని చెప్పాలనుంది
నవ్వుతూ మెరిసే నీ కళ్ళలోకి దిగులుమబ్బులు రప్పించిన పాపం నాది
ఒక్కసారిటు చూడవూ
నాలో చీకటి నువ్వొస్తే ఊపిరి పీల్చుకోవాలని ఎదురుచూస్తుంది

No comments:

Post a Comment