అలసిన నీ కన్నుల ఎరుపుల్లో
నిద్దురకాచి నా ఊహలు నేసిన సంతోషం
విరిసీ విరియని పెదవుల మధురసం
చెరిసగం పంచేసుకున్న గర్వమేమో కదూ
నిద్దురకాచి నా ఊహలు నేసిన సంతోషం
విరిసీ విరియని పెదవుల మధురసం
చెరిసగం పంచేసుకున్న గర్వమేమో కదూ
చీకటి రాత్రి మదిలో వెన్నెల నిండినవేళ
పాలపుంతలాంటి నన్ను చేరి కుచ్చిళ్ళు సవరించిన నడిరేయి
నీలో మొదలైన సరసపు సెగ నిశ్వాసలోంచి వెచ్చగా జారి
నన్ను కాల్చిన సంగతి గుర్తొస్తుంది
పాలపుంతలాంటి నన్ను చేరి కుచ్చిళ్ళు సవరించిన నడిరేయి
నీలో మొదలైన సరసపు సెగ నిశ్వాసలోంచి వెచ్చగా జారి
నన్ను కాల్చిన సంగతి గుర్తొస్తుంది
ఎదనుండీ ఒడిలోకి జారేలోపు ఎన్ని మజిలీలో
నాలా నన్నుండనివ్వని నీ నరనరం
మునివేళ్ళ కదలికలో మొదలైన గమకముతో
పూర్తిగా నీతో లయించుకున్న ఆ మోహం తెలిసొచ్చింది
నాలా నన్నుండనివ్వని నీ నరనరం
మునివేళ్ళ కదలికలో మొదలైన గమకముతో
పూర్తిగా నీతో లయించుకున్న ఆ మోహం తెలిసొచ్చింది
No comments:
Post a Comment