కొన్ని గులాబీలు లేతవాసనేస్తున్నట్టు
ఎప్పుడో అలా వచ్చి వెళ్ళిపోతావా
కొంత చల్లగా కొంత వెచ్చగా అనిపించేలా
చప్పుడు చేయని రెప్పలు
ఎందుకు తడుస్తున్నాయో తెలీక
నేనేమో స్వేదం పట్టేవరకూ నిలిచుండిపోతా..
గొంతెత్తి పిలిచినా నీకు వినబడదని
కనుచూపు మేర నగ్నమైన చెట్లలో దాగిన
పక్షుల్నీ, పువ్వుల్నీ
నీ సమాచారం అడుగుతూంటా..
Woah... చలికాలపు బద్దకానికేమో
నా మాట వినబడనట్టు నటిస్తున్నవన్నీ
నీ పక్షమేనేమో
ఇప్పుడు నేనేం చేయాలీ..
విరహానుభవమయ్యే వరకూ
మీ అందరినీ వెలివేయాలి
No comments:
Post a Comment