మాటవినని మనసుకి సర్దిచెప్పే ప్రయత్నంగా
సంచరిస్తున్న మబ్బుల అడుగుజాడల్లో
కాస్తంత వెలుతురు పట్టుకోవాలని
వంగిన నీడల మాటు వెతుకుతున్నా
అనాలోచిత విరామం పూర్తవదు..
నిశ్శబ్దపు నిగారింపు నిర్ధారించేందుకు
సాయింత్రాలన్నీ ఒకేలా ఉండవనీ
రోజూ పక్షులేం పాటలు పాడవనీ
ఒంటరితనపు కాగితమ్మేద రంగులు
గతానికి కొత్తబట్టలేసినట్టు ఉండవని తెలిసేదెలానో..
Be alive n save urself
No comments:
Post a Comment