1. హేమంతం నర్తిస్తూ
తన అందాన్ని వెదజల్లుతుంది
పగటికి కాలం తక్కువై
చీకటికి ఆయుష్షు ఎక్కువై
నా చుట్టూ నీ జ్ఞాపకాల అలలవుతుంది
2. నిశ్శబ్దంగా కురుస్తున్న వెన్నెల
నన్ను కన్నెత్తి చూడమంటుంది
ఆకాశమైదానంలో నక్షత్రాల నవ్వులు
నా నిశ్శబ్దాన్ని వెలిగిస్తూ
పున్నమి సోయగాన్ని బుగ్గలకు పూస్తున్నట్లుంది
3. Ohh.. తగ్గినట్టే తగ్గి
మళ్ళీ తిరగబెట్టింది చలి
నీ మాటలు కప్పుకోబట్టి సరిపోతుంది కానీ..
ఈపాటికి మంచుమొక్కై మిగిలేదాన్ననిపిస్తుంది
No comments:
Post a Comment